హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా నిన్న ప్రారంభమైన కూకట్ పల్లి ‘సౌతిండియా షాపింగ్ మాల్'ను శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసారు. ఈ రోజు ఉదయం మాల్‌లో తనిఖీలు నిర్వహించిన జీహెచ్ఎంసీ కమీషనర్ కృష్ణబాబు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందకుండా భవనాన్ని నిర్మించారని పేర్కొంటూ సీజ్ చేసారు.
నిన్న మహేష్ బాబుతో గ్రాండ్ గా ఓపెన్ అయిన ‘సౌతిండియా షాపింగ్ మాల్' కనీసం 24 గంటలైనా గడవకముందే సీజ్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహేష్ బాబుతో ప్రారంభించడం, భారీగా ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులు నిబంధనలు పట్టించుకోక పోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులైతే తీవ్రమైనా అసహనానికి గురవుతున్నారు. నిర్వాహకులు చేసిన పని వల్ల తమ హీరోకి చెడ్డపేరు వస్తోందని..... మహేష్ బాబుతో ఓపెనైన మాల్ మూత పడిందట అనే ఎత్తిపొడిచే మాటలు మేము తట్టుకోలేక పోతేన్నామని మహేష్ బాబు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు మహేష్ బాబు అనేక కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. వాటితో ఒప్పందం కుదుర్చుకునే ముందుకు ఇందుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకునే సిబ్బంది అన్ని వివరాలు ఆరా తీసిన తర్వాత, అన్నీ పర్ ఫెక్ట్ గా ఉంటనే మహేష్ బాబు ఓకే చెబుతారు. కానీ సౌతిండియా షాపింగ్ మాల్ విషయంలో మహేష్ బాబు యాడ్స్ చూసుకునే సిబ్బంది ఏమరు పాటుతో వ్యవహరించడం వల్లనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని, నింబంధనలు పట్టించుకోలేదని తెలిస్తే మహేష్ బాబు ఓపెనింగుకు వచ్చే వారే కాదని పలువరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏ తెలుగు హీరో కూడా మహేష్ బాబు రేంజిలో యాడ్ ఫిల్మ్స్ ద్వారా సంపాదించడం లేదు. ఇటు కమర్షియల్ యాడ్లలో... మరో వైపు సినిమాల్లో సూపర్ స్టార్‌గా కొనసాగుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబుసుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు. ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్ గా ఎంపికైంది.
No comments:
Post a Comment