హైదరాబాద్ : మొన్న గురువారం అల్లు అర్జున్ తాజా చిత్రం జులాయి రిలీజైంది. ఈ చిత్రానికి వైజాగ్ కి లింక్ ఉంది. అల్లు అర్జున్ సినిమాలకు వైజాగ్ సెంటిమెంట్ ఉంది. గతంలో ఆర్య, బన్నీ,దేశముదురు,పరుగు చిత్రాలకు వైజాగ్ లోనే షూటింగ్ జరిగింది. ఈ చిత్రాలన్ని విజయం సాధించాయి. అలాగే ఇఫ్పుడు జులాయి కూడా అక్కడ షూటింగ్ చేసారు. దాంతో అల్లు అర్జున్ కి ఈ సారి వైజాగ్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యిందా లేదా అనే చర్చలు మొదలయ్యాయి. టాక్ డివైడ్ గా ఉన్నా కలెక్షన్స్ బావుండటంతో ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యినట్లే అంటున్నారు విశ్లషకులు.
ఇక అందుకు సాక్ష్యం మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ అంటున్నారు. ఈ చిత్రం వరల్డ్ వైజ్ గా 11 కోట్లు(గ్రాస్) వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో
2.5 కోట్లు(గ్రాస్)వచ్చింది. నైజాం ఏకియాలో 2.5 కోట్లు వసూలు చేసింది. అలాగే చెన్నై లో 30 దియోటర్స్ లో రిలీజ్ చేసారని,85 % వసూలు చేసింది. ''హీరోగా నేనేం చేసినా... ఎంత పేరు తెచ్చుకొన్నా కేవలం అది దర్శకుల వల్లే. సినిమా అనేది సమష్టి కృషే అయినా... దర్శకుడి కష్టమే ఎక్కువ. 'జులాయి' విషయంలో కూడా త్రివిక్రమ్ ఎంతో శ్రమించారు''అని చెప్పారు అల్లు అర్జున్.
అలాగే తానిప్పటివరకు నటించిన చిత్రాలన్నింటికీ తొలిరోజు డివైడ్ టాక్ వచ్చిందని, ఏరోజైనా సినిమా హిట్ అన్న స్పందన మొదటి రోజు వినాలని ఎదురుచూశానని, ఆ బాధను జులాయి చిత్రం తీర్చిందని అల్లు అర్జున్ అన్నారు. ''ఈ రోజే ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశా. చాలా బాగుంది''అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. మలయాళంలో ఈనెల 17న విడుదల చేయనున్నామని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక కూడా జరుపుతామని, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని నిర్మాతలు డివివి.దానయ్య, రాధాకృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
No comments:
Post a Comment