Thursday 6 September 2012

సాయి మహిమ-కొత్త గెటప్‌లో రాఘవేంద్ర రావు


 దర్శకుడు రాఘవేంద్రరావును గడ్డం లేకుండా చూసిన వాళ్లు ఎంత మంది? అంటే చాలా మంది నుంచి చూడలేదనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే దర్శకేంద్రుడు ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తారు. ఆయన సినీ కెరీర్లో గడ్డం తీసిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. తాజాగా ‘షిరిడి సాయి' విడుదల నేపథ్యంలో తను ఎంతో అపురూపంగా పెంచుకున్న గడ్డాన్ని తీసేసారు దర్శకేంద్రుడు. 
‘షిరిడి సాయి' సినిమా విడుదలను పురస్కరించుకుని నాగార్జున, అమల, నిర్మాత మహేష్ రెడ్డితో పాటు తిరుమల వెళ్లిన రాఘవేంద్రరావు మొక్కుబడి కింద తిరుమలేశునికి తన గడ్డాన్ని సమర్పించుకున్నారు. అనంతరం హైదరాబాద్ వచ్చాక ఇలా గడ్డలేకుండా కనిపించారు. గడ్డం లేక పోయినా దర్శకేంద్రుడు బాగానే ఉన్నాడు కదూ..!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...