Monday, 30 April 2012

‘గబ్బర్‌ సింగ్’ రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ గబ్బర్ సింగ్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 10వ తేదీన ఈచిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని మే 4వ తేదీన ఈచిత్రం సెన్సార్‌కు వెళ్లబోతోంది.

హరీశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈచిత్రంలో పవర్ స్టార్ కొండవీడు పోలీస్‌గా కనిపించబోతున్నాడు. శృతి హాసన్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ…అతను ఖాకీ కడితేనే పోలీసు. నెత్తి మీద టోపీ ఉన్నంతసేపూ సెక్షన్ల గురించి, చట్టాల గురించి పట్టించుకొంటాడు. లాఠీ పక్కనపెడితే అతనికంటే పెద్ద రౌడీ ఉండడు. కేడీగాళ్లను దారిలోకి తీసుకురావాలంటే… ఈ పద్ధతే సరైనదని అతని నమ్మకం. ఇంతకీ కిలాడీ పోలీసు లక్ష్యమేమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు‌.


సల్మాన్‌ ఖాన్‌ హీరోగా బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘దబంగ్‌’ను తెలుగులో ‘గబ్బర్‌ సింగ్‌’ పేరిట రీమేక్‌ చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ పాత్రను పవన్‌ కళ్యాణ్‌ పోషిస్తుండగా శృతి హాసన్‌, సుహాసిని, అభిమన్యు సింగ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వంలో చిత్రీకరించే ఆ ఫైట్ సీన్స్ కు పవన్‌ తనదైన స్టైల్‌ జోడించారు

పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...