Thursday, 26 April 2012

DHAMMU NEGTIVE TALK ON INDUSTRY

ఎన్టీఆర్ దమ్ము చిత్రం రేపు భారీగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ బజ్ తో ఉన్న ఈ చిత్రంపై గత రెండు రోజులుగా నెగిటివ్ ప్రచారం మొదలయ్యింది. ఈ చిత్రం క్లైమాక్స్ వీక్ గా ఉందని, సెకండాఫ్ లో సెంటిమెంట్ ఓవర్ గా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరు ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అనేది తెలియకపోయినా నెట్ లో, ఫేస్ బుక్ లో వీటిని టాక్ ని స్ప్రెడ్ చేయటం జరుగుతోంది. సినిమా రిలీజవకముందే ఎలా క్లైమాక్స్ వీక్ గా ఉందని డిసైడ్ చేస్తారంటూ ఫ్యాన్స్ కొందరు మండిపడుతున్నారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ టాక్ కూడా చాలా బాగా ఉండటంతో కావాలనే కొందరు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయినా మరో ఇరవై నాలుగు గంటల్లో సినిమా విడుదల అవుతున్న సమయంలో ఈ రూమర్స్ నమ్మటం అర్దం లేనిదనేది నిజం.

ఇక సినిమా విషయానికి వస్తే ...పూర్తి స్దాయి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఫిల్మ్ గా దీన్ని దర్శకుడు అభివర్ణిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్,ప్రీ క్లైమాక్స్ సీన్స్ చాల అద్బుతంగా కుదురియాని వచ్చాయని చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బోయపాటి శ్రీను.

ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో హైలెట్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి ..ఎన్టీఆర్ సింహాద్రిను తలపించే రేంజిలో పాత్ర అంటున్నారు. ఆ రేంజి ఎమోషన్స్ ఆ పాత్రలో నింపాడని చెప్తున్నారు. అలాగే చిత్రంలో రెండో హైలెట్ సిస్టర్ సెంటిమెంట్. శంభో శివ శంబో లో చేసిన అభినయ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు చెల్లిగా చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే టచింగ్ సీన్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాంటున్నారు. రాఖీ రేంజిలో సిస్టర్ సెంటిమెంట్ పండుతుందని చెప్తున్నారు. వీటికి అదనపు బలం ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం. యమదొంగ,సింహాద్రి తరహాలో ఈ చిత్రంలో పాటలన్నీ మ్యూజికల్ హిట్స్ అవ్వటమే కాక సినిమా సీన్స్ కు బలం చేకూరుస్తాయని చెప్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...