Saturday, 23 June 2012

MEMVAYASUKUVACHHAM


విడుదల తేది : 23 జూన్ 2012
రేటింగ్: 2.75/5
దర్శకుడు : త్రినాధ రావు నక్కిన
నిర్మాత : బి వేణు గోపాల్, కేదారి లక్ష్మణ్
సంగీత దర్శకుడు: జి శేఖర్ చంద్ర
తారాగణం : తనీష్, నీతీ టేలర్

చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగి నచ్చవులే, రైడ్ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో తనీష్ తాజా చిత్రం ‘మేం వయసుకు వచ్చాం’. నీతి టేలర్, మదాలస శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల తీర్పును ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.
కథ :
లక్కీ (తనీష్) మొదటి చూపులోనే ఖుషి (మదాలస శర్మ) ని ప్రేమిస్తాడు. ఖుషి కూడా లక్కీని ప్రేమిస్తుంది. వారు పెళ్ళికి కూడా సిద్ధమవుతారు. తనని ప్రేమించిన వాడు తనని మాత్రమే ప్రేమించాలి అనుకునే ఖుషి కి లక్కీ పర్సులో వేరే అమ్మాయి ఫోటో చూసిన ఆ అమ్మాయి ఎవరని లక్కీని నిలదీస్తుంది. అప్పుడు లక్కీ తన కాలేజీ రోజుల్లో జరిగిన ప్రేమకథ గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. లక్కీ, దిల్ (నీతి టేలర్) ఒకే కాలేజీలో చదువుకుంటారు. దిల్ అందం, అమాయకత్వం నచ్చిన లక్కీ ఆమెని ప్రేమిస్తాడు. తన ప్రేమని చెప్పే సమయానికి ఆమెకి వేరొకరితో పెళ్లి నిశ్చయమైందని తెలుస్తుంది. ధైర్యం చేసి ఆమెకి తన ప్రేమ విషయం చెబుతాడు. తాము ఇద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని లక్కీ మీద తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెబుతుంది. తన ప్రేమని అంగీకరించకపోయిన తనతో మూడు రోజులు సరదాగా ఉంటే ఆ జ్ఞాపకాలతో జీవితాంతం గడిపేస్తాను అంటాడు. ఈ ప్రపోజల్ కి అంగీకరించిన దిల్ మూడు రోజులు పూర్తయ్యే సమయానికి లక్కీతో ప్రేమలో పడుతుంది. ఇంట్లో వారిని కాదనలేక లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ తరువాత ఏమైంది? వేరు పెళ్లి చేసుకున్నారా అనేది మిగతా చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్ :
మొదటి రెండు సినిమాలతో ఆకట్టుకున్న తనీష్ ఆ తరువాత తనకు సరిపడని మాస్ ఇమేజ్ కోసం సినిమాలు ఎంచుకుని తడబడ్డాడు. మళ్లీ తనకు సరిపోయే ప్రేమకథ ఎంచుకున్న తనీష్ ఈ సినిమాలో బాగా చేసాడు. వెళ్ళిపోకే పాటలో పరిణతి కూడిన ప్రదర్శన చూపించాడు. దిల్ పాత్రలో నటించిన నీతి టేలర్ యువతని బాగా ఆకట్టుకుంటుంది. నటన విషయంలో కూడా మంచి మార్కులే సంపాదించుకుంది. మదాలస శర్మ పాత్ర తక్కువే అయినప్పటికీ పర్వాలేదనిపించింది. ఒక పాటలో అందాలూ ఆరబోసింది. ప్రముఖ నటుడు/దర్శకుడు భాగ్యరాజ ప్రత్యేక పాత్రలో కనిపించారు. హీరో ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళు కామెడీ బాగానే పండించారు. రమాప్రభ, కాశి విశ్వనాధ్, సూర్య అందరు పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్ :
చిత్ర మొదటి భాగం కామెడీ సన్నివేశాలతో అలరించిన దర్శకుడు రెండవ భాగంలో పూర్తిగా తడబడ్డాడు. ఇంటర్వెల్ దగ్గర ఆగిన కథ ముందుకి సాగదు. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు వాస్తవికతకి దూరంగా ఉంది. కాలేజీ సన్నివేశాలు బాగానే ఉన్న రెండవ భాగంలో చాలా సన్నివేశాలు హీరో, హీరోఇయిన్ల మధ్యే ఉండడంతో బాగా బోర్ కొడుతుంది. సాంగ్స్ బాగాలేకపోవడం వాటి టైమింగ్ కూడా కుదరకపోవడం చిరాకు తెప్పిస్తుంది. నీతి టేలర్ కి డబ్బింగ్ విషయంలో కేర్ చుపించకపోవడంతో లిప్ సింక్ కాలేదు. రెండు విభిన్న మతాలకి చెందిన యువతీ యువకుల మధ్య ప్రేమకథని కాన్సెప్ట్ గా ఎంచుకున్న దర్శకుడు కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు.
సాంకేతిక విభాగం :
నివాస్ రాసిన సంభాషణలు చాలా బావున్నాయి. సినిమాకి ప్రధాన బలం డైలాగులే. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. శేఖర్ చంద్ర సంగీతంలో వెళ్ళిపోకే పాట బావుంది. నేపధ్య సంగీతం బావుంది. రెండవ భాగంలో తడబడ్డా దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా పర్వాలేదనిపించాడు.
తీర్పు :
తనీష్, నీతి టేలర్ నటన, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ ఆకట్టుకోగా మొదటి భాగం కామెడీ మరియు ప్రేమ సన్నివేశాలతో బాగానే అలరించాడు. చిన్న సినిమాలు కూడా చూసే మూవీ లవర్స్ అయితే సరదాగా ఒకసారి చూడొచ్చు.
123తెలుగు.కాం రేటింగ్ : 2.75/5

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...