Wednesday 19 September 2012

స్విట్జర్లాండ్ వెళుతున్న యముడికి మొగుడు



‘అల్లరి’ నరేశ్, రిచా పనయ్ జంటగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ బేనరుపై చంటి అడ్డాల నిర్మిస్తున్న ‘యముడికి మొగుడు’ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. ఈ పాటను అక్టోబరు రెండు నుంచి స్విట్జర్లాండ్‌లో చిత్రీకరిస్తున్నామని చంటి చెప్పారు. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఓ పాటను చిత్రీకరించామని తెలిపారు. నిర్మాణానంతర పనుల్లో భాగంగా సోమవారం నుంచి డబ్బింగ్ ప్రారంభించామని, మరో పక్క గ్రాఫిక్ పనులు తుది దశకు చేరుకున్నాయని చంటి చెప్పారు. ఈ నెలాఖరున ఆడియోను, విజయదశమికి సినిమాను విడుదల చేస్తామని అన్నారు. సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు సత్తిబాబు చెప్పారు. ‘యముడికి మొగుడు’ చిత్రం టైటిల్‌కు మంచి స్పందన వస్తోందని ఆయన తెలిపారు. షయాజీ షిండే, రమ్యకృష్ణ, సీనియర్ నరేశ్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, కృష్ణభగవాన్, రఘుబాబు, చలపతిరావు, ఏవీఎస్, మాస్టర్ భరత్, సత్యకృష్ణ, సన తదితరులు నటించిన ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఫొటోగ్రఫీ: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: కిరణ్‌కుమార్, సమర్పణ: ధనలక్ష్మి అడ్డాల.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...