Monday 5 November 2012

రాణా సినిమాకు కష్టాలు.... నెత్తినేసుకున్న సురేష్ బాబు!

Suresh Babu Purchased Kvj Whole Nizam Rights

హైదరాబాద్: హీరో రాణా త్వరలో ‘కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బేనర్ పై సాయి బాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి నిర్మించారు. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రాణాకు ఇప్పటి వరకు కమర్షియల్ హిట్లేమీ లేక పోవడం, గత సినిమాలన్నీ ప్లాపులే కావడంతో ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాణా తండ్రి, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు.... నైజాం ఏరియా రైట్స్ తానే కొన్నాడు. సురేష్ బాబు తన కొడుకు సినిమా కొనడం ఇదే తొలి సారి. క్రిష్ దర్శకత్వంలో సినిమా కావడంతో ఈ సారి ఎలాగైనా రాణాకు బ్రేక్ వస్తుందనే నమ్మకంతో సురేష్ బాబు ఉన్నాడట. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తన పలుకుబడి ఉపయోగించి భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేసి రాణాకు కమర్షియల్ హిట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.
తండ్రి అండతోనైనా రాణా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటుతాడో లేదో చూడాలి. కాగా....ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు క్రిష్ స్పష్టం చేసారు. ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా విడుదల తేదీ ఖరారు చేస్తూ సమాచారం అందించింది. మంగళవారం సాయంత్రం... ఈ మూవీని ఈ నెల 16 లేదా 23న విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపించాయి. అయితే రాత్రి సినిమా విడుదల నవంబర్ 9నే అని ఖరారు చేసారు.
ఈ చిత్రం స్టోరీ విషయానికొస్తే... గనుల్ని కొల్లగొట్టి వ్యాపారం చేస్తూ భూమాతకు గర్భశోకం కలిగిస్తున్న అభినవ భూభకాసురుల్ని అంతమొందించే అభినవ కృష్ణుడు కథే ‘కృష్ణం వందే జగద్గురుం'. ఈ చిత్రంలో రాణా థియేటర్ ఆర్టిస్టుగా కనిపించున్నాడు. చదివింది బీటెక్‌.
భిన్నమైన సినిమాలకు కేరాప్ అడ్రస్ గామారిన క్రిష్ కూడా.... ఇప్పటి వరకు యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకోలేదు. తాజాగా 'కృష్ణం వందే జగద్దురుమ్" సినిమా యాక్షన్ అంశాలతో విభిన్నంగా తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి, దర్శకత్వం: క్రిష్.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...