Monday 5 November 2012

ప్రభాస్‌ ‘మిర్చి' విడుదల పై కన్ఫూజన్

Prabhas Mirchi Release Creating Confusion

హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ‘మిర్చి' టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని, కాదు... డిసెంబర్ లోనే విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అవేమీ కాదు..ఈ చిత్రం జనవరి మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దాంతో అసలు ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయమే అభిమానుల్లో కన్ఫూజన్ మొదలైంది. నిర్మాతలు ఈ విషయమై ప్రకటన చేస్తే బాగుండును అనేది టాక్. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ‘ ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రభాస్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందుతుంది' అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ...‘కొరటాల శివ, నా స్నేహితుల కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలన్నీ వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారినిఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రభాస్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 'మిర్చి' అనే పేరును ఖరారు చేశాం. యాక్షన్‌ నేపథ్యమున్న కథే అయినా.. ఇందులో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్నాయి. ప్రభాస్‌ని ఒక కొత్త కోణంలో చూపించేలా దర్శకుడు కొరటాల శివ ఈ కథను తయారు చేసుకొన్నారు. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. 'మిర్చి'లాంటి కుర్రాడిగా ప్రభాస్‌ చేసే హంగామా అభిమానులకు నచ్చుతుంది'' అన్నారు.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...