Tuesday 24 April 2012

HIGHEST REMUNATION HERO PAWANKALYAN

తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించబోతున్నాడా? ఇప్పటి వరకు ఎవరూ తీసుకోనంత రికార్డు స్థాయి అమౌంట్ దక్కించుకోబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఇది తప్పకుండా సాధ్యమే అని అనిపిస్తోంది. అయితే ఇందుకు ఓ మెలిక ఉంది. పై ప్రశ్నలు నిజం కావాలంటే గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించాలి.

వాస్తవానికి ‘గబ్బర్ సింగ్’ చిత్రం చేయాలనే ఆలోచన చేసింది పవన్ కళ్యాణే. తన సొంత బేనర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. అయితే ‘తీన్ మార్’ చిత్రం ద్వారా నష్ట పోయిన నిర్మాత గణేష్‌ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి అతనికి అవకాశం ఇచ్చాడు.

ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అసలు రెమ్యూనరేషనే తీసుకోవడం లేదట. సినిమా హిట్టయితే లాభంలో చెరి సగం తీసుకుందామని పవన్-గణేష్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. గణేష్ బాబు ఈచిత్రం కోసం రూ. 15 కోట్లు ఖర్చు పెట్టాడని అంటున్నారు. సినీ పండితుల అంచనాల ప్రకారం ‘గబ్బర్ సింగ్’ చిత్రంపై ఉన్న హైప్ బట్టి చిత్రం టోటల్ రూ. 40 కోట్ల వసూళ్లు సాధించ వచ్చని అంటున్నారు. శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చిన డబ్బులను కలుపుకుంటే ఓవరాల్‌గా రూ. 32 కోట్ల లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఒప్పందం ప్రకారం పవన్ కళ్యాణ్‌కు అందులో సగం రూ. 16 కోట్లు దక్కనున్నాయి. ఈ లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ అత్యధిక మొత్తం రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో 10 కోట్ల రెమ్యూనరేషన్ మార్కును దాటిన హీరో అంటూ ఎవరూ లేరు. జూ ఎన్టీఆర్ రూ. 12 కోట్లు, మహేష్ బాబు రూ. 15 కోట్లు తమ తర్వాతి సినిమాలకు తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ లెక్క ప్రకారం తీసుకున్నా పవన్ కళ్యాణ్‌‌ది పైచేయే అవుతుందని అభిమానులు అంటున్నారు. మరి ఇవన్నీ జరుగాలంటే ‘గబ్బర్ సింగ్’ చిత్రం భారీ విజయంసాధించాలి. మరి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ..

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...