Monday, 13 August 2012

టాటా నానో కారుపై ధనుష్ వై దిస్ కొలవెరి డి

Dhanush New Kolaveri On Tata Nano
వై దిస్ కొలవెరి డి.. అంటూ యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన తమిళ నటుడు ధనుష్ (సూపర్ స్టార్ రజనీంకాత్ అల్లుడు) ఇప్పుడు టాటా నానో బాట పట్టాడు. టాటా నానో కోసం ధనుష్ ఓ పాట పాడాడు. టాటా నానో కారుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో ధనుష్ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లిరిక్స్‌తో కూడిన ఈ వీడియో సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ ట్రెండ్‌గా మారింది.
ఈ వీడియోను మా డ్రైవ్ స్పార్క్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌లో కూడా వీక్షించవచ్చు.http://www.facebook.com/drivespark
సిటీ రోడ్లపై టాటా నానో కారులో ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో, అలాగే పార్కింగ్ విషయంలోను, ట్రాఫిక్‌ జామ్‌లలోను ఈ చిన్న కారు ఎంత చక్కగా ఉపయోగపడుతుందోనని ధనుష్ ఈ వీడియోలో చూపించాడు. మరి ఈ వీడియో కూడా వై దిస్ కొలవెరి డి మాదిరిగానే పెద్ద సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. అయితే, ఈ వీడియో టాటా నానో టెలివిజన్ ప్రకటనా లేక ధనుష్ సరదాగా చేశాడో తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ.. ఈ వీడియో ద్వారా టాటా నానో అమ్మకాలు మాత్రం జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానో విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన 624 సీసీగా ఇంజన్ 38 పిఎస్‌ గరిష్ట పవర్‌ను, 51 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2012 వెర్షన్ టాటా నానో లీటర్ పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది వరకూ ప్రతి కిలోమీటర్‌కు 92.7 గ్రాముల కార్బన్‌ డైఆక్సైడ్‌ (సీఓ2)ను మాత్రమే విడుదల చేస్తుంది.
టాటా నానో మొత్తం మూడు వేరియంట్లలో (స్టాండర్డ్, సిఎక్స్, ఎల్ఎక్స్) లభ్యమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో టాటా నానో ధరలు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల (ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. టాటా నానో 10 ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...