Friday, 20 April 2012

ఏప్రిల్ 23న మార్కెట్లోకి రానున్న 2012 టీవీఎస్ అపాచీ

టీవీఎస్ మోటార్ కంపెనీ అప్‌గ్రేడ్ చేసిన 2012 వెర్షన్ అపాచీ స్పోర్ట్స్ బైక్‌ను వచ్చే సోమవారం (ఏప్రిల్ 23, 2012) మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఒక రకంగా మంచి వార్తే అయినప్పటికీ, బైక్ ప్రియులకు ఇంకొక చేదు వార్త ఏంటంటే కొత్త అపాచీలో 200సీసీ, 220సీసీ, 250సీసీ వీటిల్లో ఏది కూడా ప్రస్తుతానికి మార్కెట్లోకి రావటం లేదు.

టీవీఎస్ విడుదల చేయనున్న ఈ కొత్త 2012 వెర్షన్ అపాచీలో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఏబిఎస్ వేరియంట్ అపాచీలో ఉపయోగించిన 180సీసీ ఇంజన్‌నే ఉపయోగించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న అపాచీ ఆర్‌టిఆర్ 180 ఏబిఎస్ వేరియంట్‌కు కొద్దిగా మేకప్ వేసి కంపెనీ మార్కెట్లోకి విడుదల చేయబోతుంది.

New Apache RTR 
                                     కొత్త 2012 అపాచీలో సరికొత్త హెడ్‌ల్యాంప్, బ్లూకల్ ఇల్యుమినేషన్‌తో కూడిన రీడిజైన్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ (స్పీడోమీటర్ కన్సోల్), ఫ్యూయెల్ ట్యాంక్‌పై 3డి అక్షరాలతో కూడిన 'అపాచీ' లోగో, రీడిజైన్ చేయబడిన స్ప్లిట్ ఫుట్ రెస్ట్స్, ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, సరికొత్త ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ వంటి కొన్ని కాస్మోటిక్ మార్పులు ఉండనున్నాయి.

మరో మూడు రోజుల్లో మార్కెట్లోకి రానున్న ఈ మోడల్‌కు సంబంధించిన రహస్య చిత్రాలు ఇప్పటికే ఇంటర్‌నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోటోలోను మా డ్రైవ్ స్పార్క్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌లో కూడా చూడవచ్చు. ఈ కొత్త బైక్‌కు సంబంధించి మరిన్న కొత్త విషయాలు తెలియాలంటే సోమవారం వరకూ ఆగాల్సింది. 2012 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...