Friday, 13 April 2012

రామ్ చరణ్ కంటే హీరోయిన్‌ రెమ్యూనరేషనే ఎక్కువ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘జంజీర్’ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా నటిస్తోంది. సాధారణంగా ఏ చిత్రంలో అయినా హీరోకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది. హీరోయిన్‌కు తక్కువ ఉంటుంది. అయితే జంజీర్ విషయంలో మాత్రం ఈ విషయం రివర్స్‌లో ఉంది. ఇందులో చెర్రీ కంటే ప్రియాంక చోప్రానే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ట్రేడ్స్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు ప్రియాంక రూ. 9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్ల విషయంలో ఇదే అత్యధిక మొత్తం. ప్రస్తుతం ఉన్నటాప్ బాలీవుడ్ హీరోయిన్లు కత్రినా కైఫ్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, దీపిక పడుకొనె సాధారణంగా ఆయా సినిమాలను, ప్రొడ్యూసర్లను, కథ, డేట్స్ బట్టి రూ. 2.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు తీసుకుంటున్నారు.

ఆ మధ్య ఐశ్వర్యరాయ్ రోబో సినిమాకు రూ. 5.5 కోట్లు తీసుకుంది. ఇక కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హీరోయిన్’ చిత్రానికి ఆమె రూ. 6 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఆ చిత్రం కథ మొత్తం కరీనా చుట్టే తిరుగుతుండటం, డేట్స్ ఎక్కువ రోజులు ఉండటం వల్ల అంత మొత్తం ఇవ్వాల్సి వచ్చిందని నిర్మాత చెప్పుకొచ్చారు.

అయితే వీరందరినీ దాటేసి ప్రియంక చోప్రా ఇప్పుడు ఒకేసారి 9 కోట్లు తీసుకుంటుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. రామ్ చరణ్‌కు బాలీవుడ్లో ఇదే తొలి సినిమా కాబట్టి సినిమాకు వచ్చే వాళ్లంతా నాకోసమే వస్తారు, రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని ప్రియాంక కొండెక్కి కూర్చోవడంతో ప్రొడ్యూసర్లు అంతమొత్తాన్ని భరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

జంజీర్ చిత్రం ఈ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. చెర్రీ తొలి బాలీవుడ్ ఎంట్రీ కావడంతో ఇటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

జంజీర్ చిత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సూపర్ హిట్ మూవీ. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్’ 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...