Sunday, 1 April 2012

Pawan Kalyan Was Rejected

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా వస్తుందంటూ గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన విక్రమ్ తోనే ఫిక్స్ అయినట్లు సమాచారం. పవన్ డేట్స్ అస్సలు ఖాళీ లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై శంకర్‌ని అడిగితే ''ప్రస్తుతం ఓ కథను సిద్ధం చేసుకొంటున్నాను. అయితే హీరో ఎవరనేది ఇంకా నిర్ణయించుకోలేదు'' అని చెప్పారు. ఇక బాలీవుడ్‌ సినిమా 'త్రీ ఇడియట్స్‌' ని రీమేక్‌ చేసిన తరవాత శంకర్‌... మళ్లీ తన శైలిలోకి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. విక్రమ్‌ని దృష్టిలో పెట్టుకొని శంకర్‌ ఓ కథను సిద్ధం చేసుకొన్నారని సమాచారం.

కొన్ని రోజులుగా ఈ విషయంపై శంకర్‌, విక్రమ్‌ల మధ్య చర్చలు నడుస్తున్నాయని తెలిసింది. విక్రమ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం 'అపరిచితుడు'. శంకర్‌ ఆలోచనలకు, సృజనాత్మకతకూ ఈ సినిమా అద్దం పట్టింది. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.. ఆ అవకాశం ఉందంటున్నారు శంకర్ అభిమానులు. ప్రస్తుతం పవన్ గబ్బర్ సింగ్ బిజిలో ఉన్నారు. ఆ తర్వాత పూరీ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ లో కంటిన్యూగా పాల్గొంటారు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...