రవితేజ వంటి కామెడీ పండించే స్టార్ .. హిట్ ఫార్ములా అయిన యమలోకం బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే ఏ రేంజిలో వినోదం ఉంటుందో అని చాలా ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అయితే వాటిన్నటికి దూరంగా..'దరువు'ని రెగ్యులర్ కథాంశాన్ని ఎంచుకుని, రొటీన్ సీన్స్ తో నింపేసారు. ముఖ్యంగా యమలోకం లో రవితేజ చేసే హంగామా అయితే అస్సలు పేలనే లేదు. రవితేజ ఎంత ఎనర్జీతో చేసినా, తాప్సీ ఎంతగా గ్లామర్ ని చూపినా, సెట్స్ తో హంగామా జరిగినా స్క్రిప్టు లోపం వాటిన్నటినీ హైలెట్ కానివ్వలేదు.
చిత్రగుప్తుడు(ఎంఎస్)తన బాస్ యమధర్మరాజు(ప్రభు)మీద కోపంతో,ఆయన్ని ఇరికించాలని భూలోకంలో ఉండే ఓ వ్యక్తిని లేపేసి తన లోకం తీసుకువస్తాడు. ఆ వ్యక్తే బుల్లెట్ రాజా (రవితేజ). దొంగతనాలు చేసుకు బ్రతికే బుల్లెట్ రాజా అప్పటికి శ్వేత (తాప్సీ)తో ప్రేమలో పడి పాడుకుంటుంటాడు. అంతేగాక ఆమె కోసం ఆమె బావ హార్బర్ బాబు (సుశాంత్ సింగ్)తో తలపడి గెలిచేలోగా పైకి పోతాడు. అయితే నరకంలో అసలు విషయం తెలుసుకున్న బుల్లెట్ రాజా, అక్కడ యముడుతో తగువు పెట్టుకుని తిరిగి భూలోకానికి రావటానికి ప్లాన్ చేసుకుంటాడు. అయితే అప్పటికే అతని శవం కాలి బూడిదై పోయింది. అప్పుడు తన పోలికలతోనే ఉన్న రవీందర్(మళ్లీ రవితేజ) అనే మర్డరైపోయి చనిపోయిన హోం మినస్టర్ శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత బుల్లెట్ రాజా ఏం చేసాడు... తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు.. హోం మినిస్టర్ ని చంపిన వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడన్నది మిగతా కథ.
యమలోకం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన గత చిత్రాలును గుర్తు చేసే ఈ చిత్రం.. మొదట హీరో ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేస్తుంది. దానితో హీరో శరీరం మార్చుకున్న తర్వాత తన ప్రేమ కోసం చేసే పనులు, వాటికి వచ్చే అడ్డంకులు దిశగా సినిమా నడుస్తుందనుకుంటాం. అయితే అలా కాకుండా హీరో ప్రవేశించే హోం మినిస్టర్ పాత్రకుండే సమస్యలను తీర్చేటట్లు కథనం ఏర్పాటు చేసారు. దొంగగా ఉండే హీరో ఎందుకు అలా హోం మినిస్టర్ శరీరంలోకి ప్రవేశించినా తన క్యారక్టరైజేషన్ ని మర్చిపోకుండా.. ఎంజాయ్ చేయక లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకుంటాడు.. ప్రజలు కోసం ఎందుకు పాటు పడతాడు అన్న సందేహాలు కలిగాయి. దాంతో ఆ సన్నివేశాలు బాగున్నా క్యారక్టర్ కి, సీన్స్ కి మధ్య కనెక్టవిటి కట్ అయ్యిందిం. దానికి తోడు హీరో ఏక పక్షంగా ఎదురే లేకుండా(నెగిటివ్ పాత్రలు ఏమి చేయకుండా) దూసుకుపోతూండటంతో, కాంప్లిక్ట్ లేకుండా పోయి, డ్రామా మిస్సైంది. దాంతో సెకండాఫ్ మొత్తం ఏదో సీరియల్ లా సాగుతున్న ఫీలింగ్ కలిగింది. ఇది కథన సమస్యే.
నటీనటుల్లో రవితేజ తన రొటీన్ హావ భావాలతో నవ్వించే ప్రయత్నం చేశాడు. శ్వేతగా తాప్సీ ఎప్పటిలాగే నటనను వదిలేసి.. గ్లామర్ ను తన శక్తి మేరకు ఒలకపోసింది. పాటల విజువలైజేషన్ లో ‘ఉసుమలరాసే’ పాట బాగుంది. సినిమాకు హైలెట్ గా భావించి ఫుల్ లెంగ్త్ గా విద్యాబాలన్ పాత్రలో బ్రహ్మానందం ఉన్నంత సేపు నవ్వించాడు. హీరో తల్లిగా జయసుధ కొత్తగా చేయకపోయినా సెంటిమెంట్ బాగా పండించింది. డింక్ చికా.. డింక్ చికా అంటూ పవిత్రానంద స్వామిగా రఘు బాబు, హోం మినిస్టర్ పిఎ పాత్రలో శ్రీనివాస రెడ్డి బాగా నవ్వించారు. ఆడియో సినిమాకు ప్లస్ కాలేదు. డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి. శివ పూర్వాశ్రమంలో కెమెరామెన్ కావటంతో ఆ విభాగం బాగానే ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇకొంచెం షార్పు చేసి ఉంటే బాగుండేదనిపించిది.
రవితేజ సినిమా కదా తెగ నవ్వేసుకోవచ్చు అని పెద్దగా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఫరవాలేదనిపిస్తుంది. వేసవికాలం కాస్సేపు ఎసి లో కూర్చోవచ్చు అని వెళితే లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి బాగానే గిట్టుబాటు అవుతుంది. టోటల్ గా ప్రేక్షకులకు సినిమా చూశాక ఓ బరవు మోసిన పీలింగ్ ని ఇస్తుంది
No comments:
Post a Comment