Sunday 27 May 2012

రామ్ చరణ్,వినాయిక్ చిత్రంలో ఆ పాట రీమిక్స్

http://telugu.way2movies.com/wp-content/uploads/2012/04/Ram-Charan-_shirtless_zanjeer.jpg 


 రామ్ చరణ్,వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గువ్వా గోరింక తో పాట రీమిక్స్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. చిరు సూపర్ హిట్స్ లో ఒకటైన ఖైది నెంబర్ 786 లో చిరంజీవి, భానుప్రియ లపై చిత్రీకరించిన పాట ఇది. గతంలోనూ రాజమౌళి తో చేసిన మగధీర లో బంగారు కోడిపెట్ట పాటను, రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ లో వాన వాన వెల్లువాయే పాటలు రీమిక్స్ చేసి హిట్ కొట్టారు.


అలాగే ఈ చిత్రానికి రామ్ చరణ్ నిక్ నేమ్ అయిన చెర్రి అని పెడదామని పిక్స్ అయినట్లు సమాచారం. గతంలో అల్లు అర్జున్ తో సినిమా చేసి అతని నిక్ నేమ్ అయిన బన్ని అని పెట్టిన వినాయిక్ ఈ సారి 
                                                       
   

చెర్రీతో ఆ రేంజి హిట్ కొడదామని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాజల్ అగర్వాల్,అమలా పాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని యూనివర్శల్ స్టూడియో బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా.

దర్శకుడు వినాయక్‌ చిత్రం గురించి చెబుతూ ..చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు. వినోదం, యాక్షన్‌... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...