Wednesday 30 May 2012

‘అధినాయకుడు’ కష్టాల గురించి రాజమౌళి!

Rajamouli Tweet About Adhinayakudu  

బాలయ్య నటించిన ‘అధినాయకుడు’ చిత్రం సంక్రాంతి నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్ 1న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈచిత్రం విడుదల ఇంత ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు అధినాయకుడు కష్టాలు తీరడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.

‘అధినాయకుడు చిత్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి విడుదలవుతుండటం మంచి వార్త. ఒక పెద్ద చిత్రం ఎక్కువ కాలం విడుదల కాకుండా ఉండటం పరిశ్రమకు మంచి కాదు. ఎంతో మందిపై ప్రభావం పడుతుంది. ఏది ఏమైతేనేం అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. అధినాయకుడు చిత్రానికి పని చేసిన అందరికీ బెస్టాఫ్‌లక్’ అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.

అధినాయకుడు సినిమా విడుదలవ్వడంపై రాజమౌళి ఇంత సంతోష పడటానికి అసలు కారణం వేరే ఉంది. అధినాయకుడు లాంటి పెద్ద సినిమా త్వరగా విడుదలైతే...త్వరలో విడుదలకానున్న తన ‘ఈగ’ చిత్రానికి కాంపిటీటర్ తగ్గుతాడు. అదన్నమాట అసలు విషయం! 


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...