కాజల్ ని తెలుగులో పరిచయం చేస్తూ గతంలో తేజ లక్ష్మీ కళ్యాణం అనే చిత్రం
చేసిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఆ చిత్రం భాక్సాఫీస్
వద్ద ఫెయిలైనా కాజల్ కి తెలుగులో మంచి లైఫ్ ఇచ్చింది. రీసెంట్ గా కాజల్
గురించి దర్సకుడు మాట్లాడుతూ...ఆమె మంచి డాన్సర్...మంచి ఏటిట్యూడ్ ఉన్న
అమ్మాయి. అయితే ఆమె పర్టిక్యులర్ సీన్ కి యాక్ట్ చెయ్యమంటే చెయ్యలేదు.
అప్పుడు ఆమె తల్లి వచ్చి లోపలకు తీసుకు వెళ్లి ఆమెకు ఓ స్యాడ్ అకేషన్
గుర్తు చేసింది. దాంతో ఆమె ఏడవటం మొదలెట్టింది. వెంటనే ఆమె తల్లి బయిటకు
పరుగెత్తుకు వచ్చి వెంటనే ఆ షాట్ ని తీసుకోమని చెప్పింది అన్నారు.
అలాగే మహేష్ గురించి మాట్లాడుతూ...మహేష్ తో నిజం సినిమా చేసాను. అతను డైరక్టర్స్ ఆర్టిస్టు అన్నారు. ప్రస్తుతం తేజ చేసిన నీకు నాకు డాష్ డాష్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అంతా కొత్త వాళ్ళతో తీసిన ఆ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ వారు నిర్మించారు. ఈ చిత్రం పాటలు ఇప్పటికే రిలీజయ్యి మంచి టాక్ తెచ్చుకున్నాయి. తేజ లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

No comments:
Post a Comment