బోయపాటి తన ప్రతి సినిమాలోనూ ఓ సెంటిముంటును ఫాలో అవుతుండటం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. తాజాగా దమ్ము చిత్రంలోనూ ఆ సెంటిమెుంటును రిపీట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే...హీరోకు తప్పనిసరిగా బావమరిది(హీరోయిన్ బ్రదర్) క్యారెక్టర్ పెట్టడం.
ఆయన దర్శకత్వం వహించిన భద్ర సినిమాలో మీరా జాస్మిన్ బ్రదర్ పాత్రలో హిందీ నటుడు దీపిక్ నటించాడు. అదే విధంగా తులసి సినిమాలో నయనతార బ్రదర్ పాత్రలో శివాజీ నటించారు. సూపర్ హిట్ చిత్రం సింహాలో నయనతార అన్నయ్యగా రెహ్మాన్ నటించాడు. ఈపాత్రలన్నీ హీరోకు సపోర్టివ్‌గా ఉండటం గమనార్హం.
తాజాగా జూ ఎన్టీఆర్ దమ్ము చిత్రంలోనూ ఇదే సెంటిమెంటును బోయపాటి రిపీట్ చేస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ బావమరిదిగా వేణు నటిస్తున్నాడు. తన సెంటిమెంటను రిపీట్ చేయడం వల్ల సినిమా తప్పనిసరిగా హిట్టవుతుందనేది బోయపాటి నమ్మకం అని ఆయన సన్నిహితులు అంటున్నారు.
దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటించారు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈచిత్రాన్ని కె.ఎస్. రామారావు సమర్పణలో అగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ మీడియా బ్యానర్ పై నిర్మించారు. ఏప్రిల్ 27న దమ్ము చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ఆడియో, ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.
No comments:
Post a Comment