యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తర్వలో తన ‘దమ్ము’ చూపెట్టడానికి వస్తున్న సంగతి
తెలిసిందే. ఏప్రిల్ 27న ఈచిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. బోయపాటి
శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని కె.ఎస్.రామారావు సమర్పణలో
అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. త్రిష, కార్తీక హీరోయిన్లు. కీరవాణి
సంగీతం సమకూర్చారు.
తాజాగా దమ్ము చిత్రానికి సంబంధించి ఓ షాకింగ్ రూమర్ వినిపిస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను మలయాళంలో మోహన్ లాల్ హీరోగా 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆరామ్ తంపురన్’ చిత్రాన్ని కాపీ కొట్టి తీశారని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, హీరో హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసింది.
ఒక వేళ ఆ సినిమా ఆధారంగా ‘దమ్ము’ చిత్రం తీసి ఉంటే...బోయపాటి ఇచ్చే మాస్ టచ్‌తో సినిమా భారీ విజయం సాధించి ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ మరింత పెరుగుతుందనే వాదన కూడా ఒకవైపు వినిపిస్తోంది. అయితే ఈ కాపీ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
‘దమ్ము’ చిత్రం తర్వాత జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ చిత్రంలో నటించనున్నాడు. ఈచిత్రంలో జూనియర్‌ను విభిన్నంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూనియర్ ఇందులో కామెడీ పండించడంతో పాటు అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ ప్రేక్షకులకు పంచనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది.

No comments:
Post a Comment