Thursday 10 May 2012

ఎన్టీఆర్ ప్లాప్ కి రవితేజ రికవరి

ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద ప్లాప్ గా నిలిచిన చిత్రం శక్తి. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మితమై అశ్వనీదత్ కి భారీ నష్టాలు మిగిల్చింది. ఈ నేపధ్యంలో రవితేజ డేట్స్ ఇచ్చి అశ్వనీదత్ ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. పరుశరామ్ దర్సకత్వంలో రవితేజ హీరోగా రూపొందే ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు నిమిత్తం రవితేజ రెమ్యునేషన్ తీసుకోకుండా కేవలం షేర్ మాత్రం తీసుకునేటట్లు ఎగ్రీ అయ్య నిర్మాతకు భారం తగ్గించాడని తెలుస్తోంది. అలాగే దర్శకుడు పరుశరామ్ కి సైతం రెమ్యునేషన్ ని సినిమా పూర్తయ్యి అమ్ముడయ్యాక తీసుకునేడట్లు ఎగ్రిమెంట్ చేయించాడని చెప్పుకుంటున్నారు. అలా ఓ పెద్ద నిర్మాతను రవితేజ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

ఇక శక్తి ప్లాప్ అయ్యాక అశ్వనీదత్ తో ఎన్టీఆర్ మళ్లీ చేస్తాడని వినపడింది. అయితే అది కార్య రూపం దాల్చలేదు. ఆయన మరో ఇద్దరు హీరోలను అడిగినా వారు డేట్స్ లేవని తప్పించుకోవటంతో రవితేజ ముందుకొచ్చాడంటున్నారు. రవితేజ చిత్రం అంటే మినిమం గ్యారెంటీ చిత్రం అవుతుందనే నమ్మకంతో చేస్తున్నారు. అందులోనూ గతంలో రవితేజ, పరుశరామ్ కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రం వచ్చింది. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ యాక్షన్ ఎంటర్టనర్ చేస్తున్నట్లు వినికిడి. ఇక రవితేజ ప్రస్తుతం చేసిన దరువు చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది.

రవితేజ, తాప్సీ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘ దరువు’. సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 18న విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసినట్లు నిర్మాత చెప్తున్నారు. చిత్ర విశేషాలను వివరించటానికి మీడియా సమావేశం నిర్వహించి నిర్మాత దర్శకుడు శివ మాట్లాడుతూ... అతను పక్కా మాస్. మనిషి మాస్క్ వేసుకున్న ట్రాన్స్‌ ఫార్మర్‌ లాగా పూర్తి ఎనర్జీతో ఉంటాడు. శత్రువులకు అతనంటే బెదురే. అతగాడు దరువేశాడంటే భూగోళం దద్దరిల్లాల్సిందే. ఈ తరహా మనస్తత్వంతోనే రవితేజ పాత్రను తీర్చిదిద్దాం అన్నారు. అలాగే కొంచెం యాక్షన్‌కి, ఇంకొంచెం సున్నితమైన భావోద్వేగాలకూ చోటుంటుంది. ఈ కొలతలతో మరో సినిమా సిద్ధమైపోతోంది. ఈసారి మాత్రం వినోదాల సౌండ్‌ ఎక్కువే. మాస్‌తో తీన్‌ మార్‌ ఆడించే కథతో వస్తున్నారని చెప్పారు.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ '' రవితేజ హుషారైన నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆయన పాత్ర ఐదు విభిన్నమైన ఛాయల్లో ఉంటుంది. ఈ మాస్‌ కథకు యమలోకంతో సంబంధం ఉంది. అదేంటో సినిమా చూసి తెలుసుకోవలసిందే. విద్యా బాలన్‌గా బ్రహ్మానందం నటన నవ్వుల్ని పంచుతుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు. బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...