నాగార్జున మాటల్లోనే...మూడు దశాబ్దాల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ ఆరంభమైంది. ఇప్పుడీ స్టూడియోని ఆసియాలోనే ‘మోడర్న్ స్టూడియో’గా మలచడం జరిగింది. ఇక్కడ వేలాదిమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. మా తొలి టార్గెట్ బాలీవుడ్. ఈ స్టూడియోలో తాజాగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు ముంబయ్‌లో అతి కొద్ది స్టూడియోస్‌లో మాత్రమే ఉన్నాయి. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్‌ని టార్గెట్ చేయబోతున్నాం. అతి తక్కువ వేతనానికి కార్మికులను, జూనియర్ ఆర్టిస్టులను సమకూర్చడం జరుగుతుంది. స్టూడియో రెంట్ తక్కువగా ఉంటుంది. వచ్చే ఏడాది చివరికల్లా 45 నుంచి 50 కోట్ల రూపాయల టర్నోవర్ వస్తుందని అంచనా వేస్తున్నాం అని చెప్పారు.
ఇక 22 ఎకరాల విస్తీర్ణం గల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇప్పటికే ఐదు ఫ్లోర్లు ఉన్నాయి. వీటిని అత్యంత అధునాతన సౌకర్యాలతో రూపొందించారు. వంద కోట్ల రూపాయల పెట్టుబడితో, అంతర్జాతీయ స్థాయి విలువలతో ఈ స్టూడియోస్‌ని మలిచారు. ఇక ప్రస్తుతం నాగార్జున చేసిన ఢమురకం త్వరలో విడుదల కానుంది. అలాగే మరో ప్రక్క షిర్డీసాయిగా నాగార్జున ..రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో రెడీ అవుతున్నారు. ఈ రెండింటి తర్వాత ముళ్ళ పూడి వీరభద్రం దర్సకత్వంలో భాయ్ చిత్రం చేయటానకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్‌పై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'డమరుకం". భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ సమ్మర్ లోనే విడుదల కానుందని సమాచారం. ఇక ఈ చిత్రం పై నాగార్జున బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెప్తూ..'సోషియో ఫాంటసీ చిత్రం చేయాలన్న నా కోరిక ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ద్వారా నెరవేరుతోంది. శ్రీనివాసరెడ్డి చెప్పిన కథ బాగా నచ్చింది. ఇందులో నాలుగు రకాల గెటప్స్‌లో కనిపిస్తాను. నా పాత్ర వెస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడుతుంది. సరికొత్తగా, స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది" అన్నారు.
No comments:
Post a Comment