Saturday, 14 April 2012

ఎఫ్650 జిఎస్ సూపర్‌బైక్‌ను విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ

లగ్జరీ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ "బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్" మరో సరికొత్త సూపర్‌బైక్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇటు ఆన్-రోడ్ ఉఫయోగం కోసం అటు ఆఫ్-రోడ్ టూరింగ్ అడ్వెంచర్ కోసం డిజైన్ చేయబడిన "ఎఫ్650 జిఎస్" సూపర్‌బైక్‌ను బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ దేశీయ విపణిలోకి విడుదల చేసింది.

పూర్తిగా విదేశాల్లో తయారైన ఈ సూపర్‌బైక్‌ను బిఎమ్‌డబ్ల్యూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనుంది. భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్650 జిఎస్ మోటార్‌సైకిల్ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకునే వాహనాలపై 75 శాతం దిగుమతి సుంఖం ఉండటం వలన ఇది అంత అధిక ధర పలుకుతోంది

బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్650 జిఎస్ మోటార్‌సైకిల్‌లో పారలల్ ట్విన్ ఫోర్ స్ట్రోక్ 800సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 71 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని (వావ్ అమేజింగ్ పవర్), 76 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. చైన్ డ్రైవ్ కలిగిన ఈ సూపర్‌బైక్ గంటకు గరిష్టం 185 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఈ బైక్ మొత్తం బరువు 200 కిలోలు.

ఇందులో ప్రధానంగా ఇంజనే అధిక బరువును కలిగి ఉంటుంది. భారత్‌లో అత్యంత వేగంగా ప్రయాణించే బైక్‌లలో బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్650 జిఎస్ కూడా ఒకటి. ఈ బైక్‌కు ముందు వైపు 17 ఇంచ్ అల్లాయ్ వీల్‌ను, వెనుక వైపు 19 ఇంచ్ అల్లాయ్ వీల్‌ను అమర్చారు. అత్యవర పరిస్థితుల్లో సురక్షితమైన బ్రేకింగ్ కోసం ఈ బైక్‌లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను అమర్చారు. ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనోషాక్ (సింగిల్) సస్పెన్షన్‌ను ఉపయోగించారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...