Wednesday 11 April 2012

5 రకాలుగా రవితేజ దరువు


రవితేజ, తాప్సీ జంటగా శివ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ‘దరువు’ పాటలను ఈ నెల 18న విడుదల చేయనురు. ఈ చిత్రం విశేషాలను నిర్మాత వివరిస్తూ -‘‘మాస్‌లో రవితేజకున్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథ ఇది. రవితేజ శారీరకభాషకు తగ్గట్టుగా ఆయన పాత్రను డిజైన్ చేశారు దర్శకుడు శివ. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకునే ప్రేక్షకులకు వందశాతం ఆనందాన్ని పంచే సినిమా ఇది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మే 4న విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఇది భిన్నమైంది. ఈ కథలో మంచి ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అది తెరపైనే చూడాలి. శివ ఈ సినిమాను మలిచిన తీరు అద్భుతం. తప్పకుండా ఇది మంచి హిట్‌గా నిలుస్తుంది’’ అని రవితేజ చెప్పారు. 

ఇందులో రవితేజ పాత్రలో ఐదు రకాల షేడ్స్ ఉంటాయని, ఇలాంటి పాత్ర చేయడం తనకు ఇదే ప్రథమమని, ముఖ్యంగా రవితేజ, బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్స్ ఆడియన్స్ విపరీతంగా అలరిస్తాయని దర్శకుడు తెలిపారు. సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...