‘‘ప్రతి
శుక్రవారం సినిమావారి జాతకాలు మారిపోతుంటాయి. ఈ శుక్రవారం కింగ్ అయినవాడు,
మరో శుక్రవారం డంగ్ అయిపోతాడు. నా భవిష్యత్తు ఏమిటో కూడా ఈ శుక్రవారం
తేలిపోతుంది. ఎందుకంటే అదే రోజేన ‘నీకు నాకు డాష్ డాష్’ విడుదల కానుంది’’
అని తేజ చెప్పారు. అంతా కొత్త తారలతో వి.ఆనందప్రసాద్ నిర్మాణతలో తేజ
రూపొందించిన ‘నీకు నాకు డాష్ డాష్’ విడుదల కానుంది.
ఈ సందర్భంగా తేజ మంగళవారం పత్రికల వారితో ముచ్చటించారు. ‘‘ఈ సినిమాలో మా కథానాయిక ఊతపదం ‘డాష్’. అందుకే టైటిల్ అలా పెట్టాం. ఒకే సన్నివేశంలో ద్విముఖాలుగా భావోద్వేగాలను పండిస్తూ కొత్త తరహాలో స్క్రీన్‌ప్లే చేశాను. ఈ పద్ధతి కనుక ప్రేక్షకులకు నచ్చితే కచ్చితంగా తెలుగు సినిమాల్లో సరికొత్త మార్పులొస్తాయి.
ఈ సినిమా కోసం ‘రెడ్ ఎపిక్’ అనే అత్యాధునిక డిజిటల్ కెమెరా వాడాం. ఆసియాలోనే ఈ కెమెరా వాడిన తొలి సినిమా మాదే అవుతుంది. 5కె రిజల్యూషన్‌తో క్వాలిటీ బావుంటుంది. మా హీరో, హీరోయిన్ ఇద్దరూ బాగా చేశారు. నాకు స్టార్లతో సినిమా చేయడం చేతకాదు. మన స్టార్లను నేను హేండిల్ చేయలేను. ప్రేక్షకులు సినిమా ఇలాగే చూస్తారని ఫిలిమ్‌నగర్‌లోని పండితులే డిసైడ్ చేసేస్తున్నారు’’ అన్నారు తేజ.

No comments:
Post a Comment