Monday 20 August 2012

షాకింగ్: సల్మాన్ 100 కోట్లు... బన్నీ 43 కోట్లు!

Ek Tha Tiger 100 Crores Julayi 43 Crores
ముంబై/హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ దెబ్బకు బాక్సాఫీసు షేక్ అవుతోంది. నిర్మాతలు, డిస్టిబ్యూటర్లకు కాసుల వర్షం కురుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘ఏక్ థా టైగర్' చిత్రం రికార్డు స్థాయిలో ఐదు రోజుల్లో 100 కోట్ల కలెక్షన్ సాధించింది.
సల్మాన్ ఖాతాలో ఏక్ థా టైగర్ 100 కోట్లు దాటిన 4వ చిత్రంగా రికార్డులకెక్కింది. గతంలో సల్మాన్ నటించిన రెడీ చిత్రం రూ. 122 కోట్లు, బాడీగార్డ్ చిత్రం రూ. 148, దబాంగ్ చిత్రం రూ. 147 కోట్ల వసూలు చేసింది. తాజాగా ఏక్ థా టైగర్ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల మార్కు దాటడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈచిత్రం తప్పకుండా రూ. 150 కోట్లు క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి' చిత్రం తొలి వారంలోనే వరల్డ్ వైడ్‌గా 43 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే టాప్ 5 ఫస్ట్ వీక్ గ్రాసర్లలో ‘జులాయి' చిత్రం స్థానం దక్కించుకుంది. అల్లు అర్జున్ కెరీర్లోనే ‘జులాయి' చిత్రం బిగ్ హిట్ గా స్థానం సంపాదించుకుంది


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...