పీసీ హ్యాంగ్ అయినప్పడు చిట్టచివరి ప్రయత్నంగా కీబోర్డ సాయంతో అందరూ ఉపయోగించే కమాండ్ ‘Ctrl+Alt+Del’. ఈ కీలను ప్రెస్ చేయటం ద్వారా కంప్యూటర్ రీస్టార్ట్ అవుతుంది. ఈ సింపుల్ కీబోర్డ్ షార్ట్ కట్ ఆప్షన్‌ను కనుగొన్నది ఎవరో తెలుసా..?. 1980వ సంవత్సరంలో “డేవిడ్ బ్రాడ్లే” అనే ఐబియం ఉద్యోగి కంప్యూటర్ ప్రతిస్పందించడం మానేసినప్పుడూ, ఇక ఎలాంటి కమాండ్లను స్వీకరించకుండా నిలిచిపోయినప్పుడు సులువుగా సిస్టం ని రీస్టార్ట్ చేయడానికి మార్గం ఒకటి కనుగొనాలన్న ఉద్దేశంతో ఒక చిన్న సోర్స్ కోడ్‌ని రాశాడు. ఈ కోడ్ రాయడానికి అతనికి పట్టిన సమయం కేవలం ఒక నిముషం 23 సెకండ్లు మాత్రమే! అంత తక్కువ టైము పడితేనేం.. ఇన్నేళ్లు గడిచినా ఆ మూడు అక్షరాల తారక మంత్రానికి తిరుగే లేకుండా పోయింది. బ్రాడ్లే ఇంకా అనేక అంశాలను కనుగొన్నప్పటికీ Ctrl+Alt+Del మాత్రం అతనికి బాగా పేరు తెచ్చిపెట్టింది.
No comments:
Post a Comment