Monday 27 August 2012

హీరోయిన్ అనుష్కపై దాడి?

చెన్నయ్: హాట్ హాట్ అందాలతో ఇటు తెలుగుతో పాటు తమిళ సినీ పరిశ్రమలో ఓ ఊపు ఊపుతున్న భామ అనుష్క. ప్రస్తుతం అనుష్క కార్తితో కలిసి అలెక్స్ పాండ్యన్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. తాజాగా అనుష్కపై ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఈ చిత్రం షూటింగులో అరవ మేకప్ మెన్లు ఆమెతో గొడవ పెట్టుకున్నారని, స్విటీని దుర్భాషలాడటంతో పాటు చేయికూడా చేసుకున్నారని తెలుస్తోంది.
అనుష్క పర్సనల్ మేకప్‌మెన్‌కి తమిళ మేకప్‌మెన్స్ యూనియన్లో సభ్యత్వం లేక పోవడంతో ఈ గొడవ మొదలైందని తెలుస్తోంది. చివరకు కార్తి కలుగజేసుకుని గొడవ సద్దుమనిగేలా చేసాడట. ఈ హఠాత్పరిణామంతో అనుష్క బోరున ఏడ్చిందనే హాట్ గాసిప్ ఆమె అభిమానులను హర్ట్ చేసింది.
ప్రస్తుతం అనుష్క చేతిలో బోలుడు సినిమాలున్నాయి. విక్రమ్హీరోగా రూపొందుతున్న ‘తాండవం' చిత్రంతో పాటు, కార్తిసరసన ‘అలెక్స్ పాండ్యన్' చిత్రంలో, ఆర్యతో కలిసి ‘బృందావనంలో నందనకుమారుడు' చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా హీరో సూర్యతో ‘సింగం-2' చిత్రంలో హీరోయి‌న్‌గా ఎంపికయింది.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...