Wednesday 22 August 2012

15 సెంటర్లలో ‘గబ్బర్ సింగ్’ రూ. కోటి (ఏరియావైజ్)


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15 సెంటర్లలో రూ. కోటి కలెక్షన్ సాధించింది. ఇప్పటికే 65 సెంటర్లలో గ్రాండ్ గా 100 రోజులు పూర్తి చేసుకుని రికర్డు నెలకొల్పిన గబ్బర్ సింగ్ తాజాగా 15 థియేటర్లలో కోటి వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇందులో నాలుగు థియేటర్లు హైదరాబాద్ లోనివే కావడం విశేషం.
రూ. కోటి సాథించిన సెంటర్లు
1. హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్స్
2. హైదరాబాద్ - ప్రసాద్ మల్టీ ప్లెక్స్
3. దిల్ సుఖ్ నగర్
4. కూకట్ పల్లి
5. వైజాగ్
6. గాజువాక
7. కాకినాడ
8. రాజమండ్రి
9. భీమవరం
10. విజయవాడ
11. గుంటూరు
12. నెల్లూరు
13. తిరుపతి
14. కర్నూలు
15. వరంగల్
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...